కరోనా వైరస్ విజృంభణ.. ఏపీలో కోవిడ్ కేసుల సంగతేంటి?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,901 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 67 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,846కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 95,733 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,57,008 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,57,587కు పెరిగింది. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 45,27,593 శాంపిల్స్ పరీక్షించారు.
తాజా కోవిడ్ మరణాలు పరిశీలిస్తే.. కడపలో 9, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణా జిల్లా, కర్నూల విశాఖలలో ఐదుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, అనంతపురం, తూర్పు గోదావరిలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతించెందారు.
ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి 10,292 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనాబారిన పడి ఇప్పటి వరకు 457008 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 95733కు తగ్గాయి.