సాల్మన్ ఫిష్‌లోనూ కరోనా వైరస్ క్రిములు.. 9 రోజులు జీవించి ఉంటాయట..
మొన్నటికి మొన్న చికెన్‌లో కరోనా వైరస్ వుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికులు ఎంతో ఇష్టపడి తినే చేపలు సాల్మన్ చేపల్లో కరోనా వుందని చైనా వెల్లడించింది. సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ క్రిములు వారం రోజుల వరకు ఉంటాయని చైనా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. లుగు డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద నిలువ ఉంచిన సాల్మన్ చేపల్లో 9 రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని తేలింది.
అలానే గది ఉష్ణోగ్రత వద్ద అంటే 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సాల్మన్ చేపల్లో రెండు రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాల్మన్ చేపలను ఎగుమతి చేసే సమయంలో వాటిని ఉంచే బాక్సుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఈ విధంగా అయితే వైరస్ 6 రోజులు మనుగడ సాగిస్తుందని చైనా పరిశోధకులు చెప్తున్నారు.
చైనా సీపుడ్ మార్కెట్ల ద్వారా ఈ వైరస్ రక్కసి వ్యాపించి ఉంటుందన్న వాదనలకు తాజా అధ్యయనం బలం చేకూర్చుతోంది. తడిగా ఉండే ఫిష్ మార్కెట్ నుంచి కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.