బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: గురువారం, 10 సెప్టెంబరు 2020 (22:29 IST)

కరోనాకి కొత్త మార్గదర్శకాలా? రెండు సంవత్సరాలు ప్రయాణం, బయటి పుడ్ వద్దు, వాస్తవాలేంటి?

దేశంలో అగ్ర పరిశోధనా సంస్థ అయిన (ఐసీఎంఆర్) కరోనా శకానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 12 పాయింట్లు ఫేక్ మార్గదర్శకాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిలో రెండు సంవత్సరాలు ఎవరూ ప్రయాణించకూడదని, ఒక సంవత్సరం ఎవరూ బయట ఆహారం తినకూడదని, శాఖాహారం మాత్రమే తినాలని, ఒంటిపై రుమాలు ఉంచుకోవద్దని అందులో పేర్కొంది.
 
నిజానికి ఐసీఎంఆర్ వెబ్సైట్‌లో కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలను తనిఖీ చేస్తే గత ఒక నెలలో అలాంటి మార్గదర్శకాలు జారీ చేయబడలేదు. 2 సంవత్సరాలు విదేశాలకు వెళ్లవద్దని, బయట ఆహారం తినవద్దనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన అన్ లాక్ 4 మార్గదర్శకంలో లేదు.
 
దీంతో ఇవి ఫేక్ మార్గదర్శకాలు అనే విషయం అర్థమయ్యింది. అయితే ఇలాంటివి ఆకతాయితో ఎవరో పోస్ట్ చేసి ఉంటారని వాటిని నమ్మి మోసపోవద్దని పలువురు సోషల్ మీడియా పరిశీలకులు సూచిస్తున్నారు.