సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:14 IST)

కరోనా సోకింది.. ఐసోలేషన్‌లో వుండక.. బీచ్‌కు వచ్చింది.. చివరికి? (video)

Spain Woman
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ సోకిందంటే.. జనాలు ఐసోలేషన్‌లో వుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. కరోనా సోకిన ఓ యువతి ఐసోలేషన్‌లో ఉండకుండా.. తాపీగా బీచ్‌లోకి వచ్చి జలకాలాడుతూ హల్‌చల్ చేసింది. ఈ విచిత్ర ఘటన స్పెయిన్ చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్ ఇటీవల అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ పాత జీవితానికి అలవాటు పడుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళకు కరోనా సోకినా సరే.. లెక్క చేయకుండా బీచ్‌లో సేద తీరేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సర్ఫింగ్ చేస్తున్న ఆమెను లైఫ్ బోట్లో వెళ్లి పోలీసులు అడ్డుకున్నారు.
 
వెంటనే ఒడ్డుకు వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని చెప్పినా మాట వినకుండా పారిపోడానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను పట్టుకోడానికి పీపీఈ కిట్లతో బీచ్‌లో పరుగులు పెట్టారు. చివరకు ఆమెను ఎలాగోలా పట్టుకుని సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెకు భారీ జరిమానా విధించి క్వారంటైన్‌కు తరలించారు. ఇక బీచ్‌లో సదరు యువతి చేసిన రచ్చ మొత్తం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.