సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:04 IST)

ప్రియుడితో కలిసి భర్తనే అడ్డు తొలగించుకోవాలనుకుంది.. భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి..?

వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్నా కొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటే సంఘటనే... తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మండపేటలో చెల్లుబోయిన కుమారి అనే మహిళకు పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరికి వివాహమైంది. మంచి, చెడులు చెప్పాల్సిన ఈమె.. ప్రియుడితో కలిసి భర్తనే అడ్డు తొలగించుకునేందుకు యత్నించింది. 
 
స్థానికంగా ఉన్న పడాల సతీష్‌ అనే రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని హతమార్చేందకు స్కెచ్‌ వేసింది. అయితే చిన్న కుమార్తెకు అనుమానం వచ్చి.. తల్లి మాట్లాడే ఫోన్‌ కాల్స్‌ను రికార్డ్‌ చేసింది. దీంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
కుమారి తన భర్తను చంపేందుకు స్లో పాయిజన్ ఇవ్వాలనుకుంది. మత్తుమందును ప్రియుడి సహాయంతో భర్త తినే ఆహారంలో కలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతను కోలుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్‌ వాయిస్‌ కాల్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో కుమారి భర్త దివాకర్‌ నిర్ఘాంతపోయాడు. కట్టుకున్న భార్య ఇలా తనను చంపేందుకు ప్రయత్నిస్తుందని తెలుసుకుని కుమిలిపోయాడు. 
 
ఈ వ్యవహారంపై మండపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పడాల సతీష్‌పై ఐపీసీ 307, 328 సెక్షన్ల కింద పోలీసులు కేసుపెట్టారు. ఈ పథకంలో ప్రధాన పాత్రదారులైన సతీష్, ప్రతాప్‌లతోపాటు బాధితుడి భార్యా చెల్లుబోయిన కుమారిని కటకటాల వెనక్కి పంపారు.