శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:29 IST)

భర్తను కసితీరా పొడిచి పొడిచి చంపిన భార్య, ఎందుకు?

భర్తతో గొడవపడి అతడిని దారుణంగా పొడిచి చంపింది భార్య. హైదరాబాదు శివారులోని రాజేంద్రనగర్‌లో ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌కు చెందిన సబీనా రోషన్, విశాల్ దివాన్‌లు భార్యాభర్తలు. విశాల్ దివాన్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. సబీనాకు అప్పటికే ఒక వివాహం జరిగి విడాకులు తీసుకుంది. ఆమెకు 23 యేళ్ళ కుమార్తె ఉంది. భర్తతో విడాకుల అనంతరం విశాల్ దివాన్‌ను సబీనా రెండో వివాహం చేసుకుంది. వీరికి 12 యేళ్ళ కుమారుడు ఉన్నాడు.
 
అయితే గత కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి ఇద్దరిమధ్య తారాస్థాయిలో మనస్పర్థలు ఏర్పడి గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వంటగదిలోని కత్తితో భర్త పొట్టలో పొడిచింది.
 
కిందపడినా అతడిని వదిలిపెట్టలేదు. పొట్టలో పొడుస్తూనే ఉంది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రిని ఆ స్థితిలో చూసిన పిల్లలు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.