కరోనా వైరస్.. ముమ్మాటికీ మ్యాన్ మేడ్ .. చైనా వైరాలిజస్టు
ప్రపంచాన్ని వణికిస్తున్న సూక్ష్మక్రిమి కరోనా వైరస్ గురించి చైనాకు చెందిన వైరాలజిస్టు డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ మమ్మాటికీ మ్యాన్ మేడేనని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు. పైగా, ఈ వైరస్ గురించి తాను పదేపదే హెచ్చరికలు చేసినా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. చైనాలు ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన తాజాగా ఆరోపించారు.
హాంకాంగ్ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న లీ మెగ్ యాన్... కరోనా వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. తాను న్యూమోనియాపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే ఈ వైరస్ చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారైనట్టు గుర్తించినట్టు తెలిపారు. ఆ ల్యాబ్ పూర్తిగా చైనా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని తెలిపారు.
కరోనా వైరస్‌పై తాను చేసిన హెచ్చరికలను చైనా కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ పట్టించుకోలేదని లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందన్నారు. కరోనా వైరస్ చైనా ల్యాబ్‌లోనే పుట్టిందని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు.
అప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్టు తెలిపారు. పైగ తన గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే తాను చైనా నుంచి అమెరికాకు వచ్చేసినట్టు చెప్పారు. తన సమాచారం మొత్తాన్ని డిలీట్ చేశారని తెలిపారు.అయితే, లీ ఆరోపణలను వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ యువాన్ జిమింగ్ కొట్టిపడేశారు. ఓదో పబ్లిసిటీ స్టంట్ అంటూ వ్యాఖ్యానించారు.