సంబంధిత వార్తలు
- మహారాష్ట్రలో 101కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. తలుపులకు స్టిక్కర్లు
- సౌదీలో కర్ఫ్యూ అమలు.. ఉల్లంఘిస్తే రూ.2 లక్షల అపరాధం
- జనతా కర్ఫ్యూ.. విరుచుకుపడిన కామాంధులు.. నాలుక కొరికేసిన..?
- తెలంగాణాలో మూడు కొత్త కేసులు.. కర్ఫ్యూ అమలుకు కేంద్రం సూచన?
- సురేష్ రైనా రెండో సారి తండ్రి అయ్యాడు.. రియా రైనాకు తమ్ముడొచ్చాడు..
కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే.. ఆ ఐదు పనులు చేయకండి..
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ కోరనా. ఈ వైరస్ సోకిన వారు ప్రపంచంలో లక్షలకు చేరుకున్నారు. మృతుల సంఖ్య వేలల్లో ఉంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్‌కు ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు.
అందుకే ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాంటి ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే రక్షణ పొందడం కోసం అనుసరించవలసిన సామాన్యమైన ఐదు పనుల గురించి గూగుల్ తన హోమ్‌పేజ్‌లో పేర్కొంది. అవేమిటంటే.
చేతులు : తరచుగా సబ్బుతో కడుక్కోవడం.
మోచేతులు : మోచేతులతో నోరు మూసి, దగ్గాలి.
ముఖం : చేతులతో పదేపదే ముఖాన్ని తాకకూడదు.
కాళ్లు : మూడు అడుగుల దూరం పాటించాలి.
సుస్తీ :ఒంట్లో బాగోలేదా? ఇంటిపట్టునే ఉండటం ఉత్తమం. మరీ బాగాలేకుంటే వైద్యుడిని సంప్రదించాలి.
తర్వాతి కథనం
