మహారాష్ట్రలో 101కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. తలుపులకు స్టిక్కర్లు
కరోనా ధాటికి మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు 101కి చేరాయి. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36కి చేరింది.
కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. తాజాగా ఒడిశా సైతం లాక్‌డౌన్ ప్రకటించింది. మార్చి 24 నుంచి 29 వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశా సర్కారు ఇటీవల ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. అయితే దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో.. లాక్‌డౌన్ ను ఐదు జిల్లాల నుంచి 14 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఉదయం ప్రకటించింది.
అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించడాన్ని గమనించిన నవీన్ పట్నాయక్ సర్కారు.. మంగళవారం నుంచి ఒడిశాలో సైతం పూర్తిస్థాయిగా మొత్తం 30 జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. అదేవిధంగా ఎవరైతే కరోనా అనుమానితులుగా హోమ్ క్వారైంటైన్‌లో ఉన్నారో వారి ఇంటి తలుపులకు స్టిక్కర్లు వేయాలని కూడా ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.