శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (15:55 IST)

జనతా కర్ఫ్యూ, విరుచుకుపడిన కామాంధులు, నాలుక కొరికేసింది...

కరోనా మహమ్మారితో జనాలు జడుసుకుంటుంటే.. కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ప్రయత్నించారు. కానీ బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. ఇంకా కామాంధులపై దాడి చేసింది. ఈ క్రమంలో ఓ కామాంధుడి నాలుకను గట్టిగా కొరికి రెండు ముక్కలు చేసింది.
 
బాధతో విలవిల్లాడిన నిందితుడు ఆమెను వదిలేసి ఆస్పత్రికి పరుగు తీశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం జనతా కర్ఫ్యూ విధించారు. ఇదే సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ మహిళపై రాకీ మొహమ్మద్, చోతు మొహమ్మదుల్లా అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు.
 
బంధించి బెడ్రూమ్‌లోకి లాక్కెళ్లిన ఇద్దరు నిందితులు తీవ్రంగా కొట్టారు. రాకీ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతుండగా బాధితురాలు అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలన్న కోపంతో నాలుకను గట్టిగా కొరికేసింది. అంతే ఒక్కసారే బాధతో విల విలలాడుతూ.. దగ్గరలోని ఆసుపత్రికి పరుగులు తీశాడు బాధితుడు. నాలుకను అతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.