గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (16:56 IST)

నేను రెండో పెళ్లి చేసుకోలేదు.. అదంతా ఫోటో షూట్ మాత్రమే.. (Video)

తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. అదంతా ఫోటో షూట్ మాత్రమేనని నటి అమలా పాల్ స్పష్టం చేసింది.  నటి అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో అమలాపాల్  వివాహం జరిగిపోయిందని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా అమలాపాల్ ఈ వార్తలను ఖండించింది. 
 
తనరెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది .తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్‌లో ఉన్న ఫోటోలు ఓ వాణిజ్య ప్రకటన కోసం తీసిన ఫోటోలని స్పష్టం చేసింది. ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది. 
 
కాగా..చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. కానీ 2014లో ఈ ప్రేమ పెళ్లి విడాకులకు దారితీసింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.