శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (14:05 IST)

కరోనా- సోమవారం ఒక్కరోజే ముగ్గురు మృతి

కరోనా భారత్‌లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సోమవారం ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విధించినా.. ఒక్కరోజు మాత్రమే దేశంలో 19 కరోనా కేసులు నమోదైనట్లు తేలింది. ఫలితంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 415కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) తెలిపింది. 
 
ఆదివారం అత్యధికంగా ముంబైలో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. కర్ణాటకలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రకటించారు.  
 
అలాగే తెలంగాణలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయింది. తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 30కి చేరింది.