శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (12:02 IST)

దేశంలో ఎనిమిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే భారత్‌లో కరోనా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. 
 
కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదు కాగా.. ఇవాళ కరోనా మరణంతో మహారాష్ట్రాలో కరోనా మృతుల సంఖ్య 3కు చేరుకుంది. ఆ రాష్ట్రంలో 144సెక్షన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని ప్రభుత్వం కోరుతుంది. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు.