ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (13:43 IST)

ఫలక్‌నుమాలో లేడీ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం - హత్య?

హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమాలో ఓ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ డ్యాన్సర్ నుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. పైగా, మృతదేహం నగ్నంగా ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలం చేకూర్చుతుంది. 
 
కొందరు దుండగులు డ్యాన్సర్‌పై అత్యాచారం జరిపి, హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. డ్యాన్సర్‌పై అత్యాచారం జరిగిందా? లేక గ్యాంగ్ రేప్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, శరీరంపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడేయడంతో దుండగులు ఆమెపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు జరుగుతోంది. మృతి చెందిన యువతిని డ్యాన్సర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.