గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (10:57 IST)

ఫ్లాటులోనే గంజాయి పెంపకం.. పూలకుండీల్లో పెంచి విక్రయం

హైదరాబాద్ నగరంలో గంజాయి మొక్కలను ఫ్లాటులోనే పెంచిన బాగోతం వెలుగులోకి వచ్చింది. యాప్రాల్‌లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కల పెంచడంతో కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ యాప్రాల్‌ గోదావరి గార్డెన్స్‌లో ఉన్న ఓ ఇంట్లో పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడు శివ, శర్మఅనే మరో వ్యక్తితోపాటు.. విదేశీ మహిళతో కలిసి తన ఇంట్లో కొన్ని రోజులుగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి మొక్కలను పెంచడంతో పాటు వాటిని విక్రయిస్తున్నట్లు విచారణో తేలింది.