సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (13:37 IST)

దోశ, ఇడ్లీ, పూరీ, వడ ఇలా ఏది తీసుకున్నా... పది రూపాయలే!

నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో బ్రేక్‌ఫాస్ట్ నుంచి భోజనం వరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు పెరిగిన ధరలతో నానా తంటాలు పడుతున్నారు. ఆ హోటల్‌లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, పూరీ, వడ ఇలా ఏది తీసుకున్నా సరే ప్లేటుకు రూ.10 చెల్లిస్తే చాలు. 
 
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా తమ హోటల్‌లో ధరలు పెంచలేదని అంటున్నారు రేణుక హోటల్ నిర్వాహకులు. గత పదేళ్లుగా హోటల్‌ను నిర్వహిస్తున్నారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరలు పెంచలేదని హోటల్ నిర్వహకులు చెప్తున్నారు. హోటల్ కర్నూలులోని రోజా వీధిలో ఉంది. ఉదయం, సాయంత్రం సమయంలో టిఫిన్‌ను అందిస్తున్నట్టు నిర్వహకులు చెప్తున్నారు.