రూ.300కే డయాలసిస్ .. ఎక్కడ?
సాధారణంగా కిడ్నీ రోగులకు చేసే డయాలసిస్ చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, ప్రైవేట్ ఆస్పత్రిల్లో ఈ వైద్యానికి భారీగా వసూలు చేస్తుంటారు. ఈ మొత్తాన్ని పేదలు భరించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతోమంది అభాగ్యులను భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్టు(బీఎంజేఆర్‌ఎఫ్‌టీ) ఆదుకుంటోంది.
రూ.వేలు అయ్యే డయాలసిస్‌ను రూ.300కే అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోంది. సోమవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలోని సెంటర్‌లో ట్రస్టీలతో కలిసి ఆ ట్రస్టు ఛైర్మన్ పి.సి.పరాక్ మీడియాతో మాట్లాడారు.
కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 24 డయాలసిస్ యంత్రాలతో కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల డయాలసిస్‌లు పూర్తి చేసిన సందర్భంగా ఈనెల 13న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.