మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (11:27 IST)

చందానగర్‌లో బాలుడు మిస్సింగ్...

హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో ఓ బాలుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలుడు వయసు 13 యేళ్ళు. చందానగర్‌లో ఇది కలకలం సృష్టిస్తుంది. 
 
సోమవారం ఉదయం అదృశ్యమైన అక్షిత్‌.. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. తమ బిడ్డ కనిపించకపోవడంతో అక్షిత్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్షిత్‌ మిస్సింగ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు కూడా గాలిస్తున్నా అక్షిత్ జాడ లభించకపోవడంతో పేరెంట్స్‌ ఆందోళన మరింత ఎక్కువైంది. 
 
అక్షిత్‌‌ ఎక్కడున్నాడో అని టెన్షన్ పడుతున్నారు. ప్రజలు కూడా అక్షిత్ జాడ కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.