కరోనా.. పది నెలలు మూతపడిన షాపు.. తెరిస్తే బాక్సులో అస్థిపంజరం
Skeleton
ప్రార్థన మందిరానికి చెందిన షాపును అద్దెకు ఇచ్చారు. లాక్ డౌన్ కన్నా ముందే వ్యాపారం సజావుగా సాగేది. కానీ తర్వాత మూసివేశారు. పది నెలల పాటు మూసివుంచిన ఆ షాపును ఓపెన్ చేయగా.. అందరూ షాక్ తిన్నారు. ఆ షాపులోని ఓ బాక్సులో అస్థిపంజరం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.
ప్రార్థన మందిరానికి చెందిన షాపు నిర్వహకులను ప్రశ్నించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే.. అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ అస్థిపంజరం ఎవరిదో తెలియదని.. విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
