1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. India reports 2,022 fresh Coronavirus cases and 46 deaths

దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా పాజిటివ్

coronavirus
దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,31,38,393కు చేరింది. ఇందులో 4,25,99,102 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 5,24,459 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇపుడు దేశంలో 14,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2099 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా 46 మంది చనిపోయారని తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పెళ్ళి ఆపాలన్న ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న వధువు సృజన