సంబంధిత వార్తలు
- సంగ్రహాలయ మ్యూజియంను ప్రారంభించిన ప్రధానమంత్రి
- ఇప్పనూనెతో ఇన్ని లాభాలా...? కాలభైరవునికి దీపం వెలిగిస్తే?
- భారత చరిత్రలో చీకటి రోజు.. జలియన్ వాలాబాగ్‌కు 103 సంవత్సరాలు
- భారత్ అంతా ఒక్కటే.. ఉత్తరాది - దక్షిణాది అనే తేడా ఉండదు : ఏఆర్ రెహ్మాన్
- ఎంపిక చేసిన ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన మాండలిజ్ ఇండియా
మరో 949 కోవిడ్ పాజిటివ్ కేసులు - ఢిల్లీలో పెరుగుతున్న కేసులు
దేశంలో కొత్తగా మరో 949 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,67,213 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 949 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు తేలింది. అదేసమయంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా మరణాలతో కలుపుకుంటే ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,21,743కి చేరుకుంది. అలాగే, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య రూ.4,25,07,038కు చేరింది. మరోవైపు, 810 మంది కోలుకున్నారు.
అయితే, రికవరీల కంటే కొత్త కేసులు కొంచెం ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 11,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 186.30 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో కేసులు క్రమంగా పెరుగుతుండటం మరోపక్క ఆందోళన కలిగించే అంశం. అంతకు ముందు రోజు ఢిల్లీలో 299 కేసులు నమోదు కాగా... నిన్న 325 కేసులు నమోదయ్యాయి.
