1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో కొత్తగా 46 వేల కరోనా పాజిటివ్ కేసులు

July 2nd Covid Media Bulletin
దేశంలో కొత్తగా మరో 46167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ బులిటెన్ ప్రకారం గత 24 గంట‌ల్లో 59,384 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251కు చేరింది.
 
ఇక మృతుల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 853 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,00,312కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,95,48,302 మంది కోలుకున్నారు. 5,09,637 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 34,00,76,232 వ్యాక్సిన్ డోసులు వేశారు. 
 
మరోవైపు, దేశంలో నిన్నటి వరకు మొత్తం 41,42,51,520 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,80,026 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
About Writer
ఠాగూర్