బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (13:53 IST)

కొన్ని దేశాల్లో స్తంభించిన ట్విట్టర్ సేవలు..

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని నెటిజన్లు గమనించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఇపుడు ట్రెండ్ అవుతోంది. 
 
ట్విట్టర్ సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రొఫైల్ లోడ్ కావడం లేదనీ, పలు థ్రెడ్‌లు అస్సలు ఓపెన్ కావడం లేదని, కొన్ని సందేశాలకు రిప్లై ఇవ్వలేకపోతున్నట్టు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ సమస్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా వారు షేర్ చేయడం గమనార్హం. ఇలా సమస్య ఎందుకు ఎదురవుతుంది అంటూ ట్విట్టర్‌కు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.