సంబంధిత వార్తలు
- కరోనావైరస్ చచ్చిపోయిందా? ఏంటీ వీళ్లంతా మాస్కులు తీసేసి హోటల్లో ఇలా తింటున్నారే!!?
- ఐపీఎల్ 2020 : లక్ష్య ఛేదనలో చతికిలపడిన సన్రైజర్స్ - ముంబై ఖాతాలో మరో గెలుపు
- షార్జాలో పరుగుల ప్రవాహం : 208 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
- మరికాసేపట్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ ఢీ
- కరోనా వైరెస్ ఎఫెక్ట్, ఆర్థిక సంక్షోభంలో అన్నవరం సత్యదేవుని దేవస్థానం
ముంబై డబ్బావాలాలకు కరోనా దెబ్బ.. బతుకులు మారుతాయా?
Mumbaiwala
పది శాతం ఉద్యోగులతో ప్రైవేటు కంపెనీలు నడుపుకోవడానికి అనుమతిచ్చింది. ఈ ''మిషన్ బిగిన్ ఎగైన్" తమ బతుకులను మాత్రం మార్చలేకపోయిందని డబ్బావాలాలు అంటున్నారు. సెప్టెంబరులో తమ సేవలు ప్రారంభమైనా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, ఆదాయం లేక ఇబ్బందులు పడిన ఈ డబ్బావాలా బతుకులను నిసర్గ తుఫాను కూడా దెబ్బతీసింది. ఈ తుఫాను కారణంగా చాలామంది డబ్బావాలాల ఆహార నిల్వలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనా డబ్బావాలాల జీవితాలు మాత్రం మారలేదు. కరోనా భయంతో ఈ సేవలు ఉపయోగించుకోవడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. తమ సేవలకు పూర్వవైభవం రావాలంటే చాలాకాలం పడుతుందని డబ్బావాలాలు బాధపడుతున్నారు.
నెమ్మదిగా మహారాష్ట్ర మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ప్రాంతాలవారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయినాసరే తమ బతుకులు మాత్రం మారడం లేదని, తమ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందని, 130ఏళ్లలో ఎప్పుడూ తాము ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదని డబ్బావాలాలు వాపోతున్నారు.
