1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. News Bulletin on Today Covid Positive Cases

దేశంలో 30 వేలకు చేరువలో కోవిడ్ పాజిటివ్ కేసులు

News Bulletin
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో 32,937 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 35,909 మంది కోలుకున్నారు. 
 
అలాగే, మరణాల విషయానికొస్తే, నిన్న 417 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,31,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,11,924 మంది కోలుకున్నారు. 
 
ప్రస్తుతం 3,81,947 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 54,58,57,108 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. నిన్న 11,81,212 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కోరుట్లలో కుంభవృష్టి : దూల్ మిట్టాలో 10.7 సెంటీమీటర్ల వాన