శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:57 IST)

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని?

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఒక బులిటెన్ రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576కు చేరింది. అలాగే క‌రోనా నుంచి  37,927 మంది కోలుకున్నారు.
 
ఇక మృతుల సంఖ్య విషయానికి వస్తే, నిన్న 493 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,31,225కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,76,015 మంది కోలుకున్నారు. 
 
3,85,336  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, నిన్న 73,50,553 వ్యాక్సిన్ డోసులు, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 54,38,46,290 డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.