భారత్ అలా చేస్తే చూస్తూ ఊరుకోం.. తాలిబన్లు
తాలిబన్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘన్ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంది. కాబూల్ మినహా మిగతా భూభాగాలను ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తుంది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
ఇక, తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఇండియాతో సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే, తాలిబన్ నేతలు ఇండియాపై ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘన్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చాలా సహాయం చేసిందని, దేశంలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, జాతీయ ప్రాజెక్టులను నిర్మించిందని నేతలు పేర్కొన్నారు.
దేశప్రజలు ఎప్పటికీ భారత్‌కు రుణపడి ఉంటారని, కానీ, తమకు వ్యతిరేకంగా మిలిటరీ చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తే చూస్తూ ఊరుకోబోమని తాలిబన్ నేతలు హెచ్చరించారు. తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భారత్‌తో మిత్రుత్వాన్ని కోరుకుంటుందని, శతృవుగా చూడదని తాలిబన్ నేతలు స్పష్టం చేశారు.