సంబంధిత వార్తలు
- కరోనాపై కేసీఆర్ యుద్ధం.. చట్టసభ సభ్యుల మద్దతు.. రూ.500 కోట్ల విరాళం
- గోవాలో వెలుగు చూసిన కరోనా... కాశ్మీర్లో తొలి కరోనా మరణం
- ప్రఖ్యాత బాంబే చెఫ్‌ను కాటేసిన కరోనా... అమెరికాలో విషాదం
- జర్నలిస్టులూ జరజాగ్రత్త... సీఎం ప్రెస్‌మీట్‌కెళ్లిన విలేకరికి కరోనా
- పవర్ స్టార్ పెద్ద మనసు : తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి - కేంద్రానికి రూ.కోటి
అమెరికాలో విషమిస్తున్న పరిస్థితి... ఒకే రోజులో పదివేల కేసులు
అమెరికాలో కరోనా వైరస్ మరింతగా విషమిస్తోంది. ఒకే రోజులో పదివేల కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 10 వేల కేసులు నమోదు కాగా, 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 68489కు చేరుకోగా, 1032 మంది మృతి చెందారు.
ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఒక్క రోజే 53 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 5 వేల మందికి కరోనా సోకింది. అలాగే, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మిచిగన్, ఇల్లినాయిస్, ఫ్లోరిడాలలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
ఇక, తొలి కరోనా కేసు నమోదైన వాషింగ్టన్‌లో మాత్రం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. అమెరికా తాజా పరిస్థితిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏప్రిల్ 12 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు, ప‌్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో మొత్తం 21,116 కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా 5 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 4,65,274 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.
తర్వాతి కథనం
