సంబంధిత వార్తలు
- నటి రేవతి బ్లాక్ మెయిల్ ఇదే ఆధారమంటున్న మలయాళ పరిశ్రమ
- వార్షిక ఉన్నత విద్య ర్యాంకింగ్ 2021లో బీటెక్ డాటా సైన్స్ ప్రోగ్రామ్ టాప్10లో ఒకటిగా నిట్ యూనివర్శిటీ (ఎన్యు)
- ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా కరణం మల్లీశ్వరి
- OU Exams: చివరి సెమిస్టర్ విద్యార్థులకు అలెర్ట్
- వరల్డ్ టాప్ రీసెర్చ్ యూనివర్శిటీగా ఐఐఎస్సీ.. అరుదైన రికార్డు
సెన్సార్ టెక్నాలజీతో ఫేస్ మాస్క్.. ప్రెగ్నెన్సీ టెస్టు మాదిరిగానే..?
Mask
ఫేస్ మాస్క్‌లతో పాటు, ప్రోగ్రామబుల్ బయోసెన్సర్‌లను ఇతర వస్త్రాలతో కలిపి ధరించడం ద్వారా ప్రమాదకరమైన పదార్థాలను ముందుగానే గుర్తించవచ్చునని చెబుతున్నారు. మూడేళ్ల పరిశోధన ఫలితమే ఈ టెక్నాలజీ అని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలు మొదట ఈ టెక్నాలజీని 2015లో జికా వైరస్‌ను గుర్తించడానికి ఒక టూల్ ఉపయోగించారు. అందులో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి.
ఇప్పుడు మరికంత సాంకేతికతను జోడించి ఫేస్ మాస్క్ మాదిరిగా ధరించగలిగేలా డెవలప్ చేశారు. ఈ పరిశోధనకు డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ, హార్వర్డ్ యూనివర్శిటీ జాన్సన్ అండ్ జాన్సన్ నిధులు సమకూర్చాయి.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా శ్వాసలో కరోనావైరస్ కణాలు ఉన్నాయో లేదో 90 నిమిషాల్లో గుర్తించగలదు. ఈ మేరకు పరిశోధకులు విడుదల చేసిన శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడించారు.
ఫేస్ మాస్క్ పై అమర్చిన సెన్సార్ ఫీచర్.. బటన్-యాక్టివేట్ అవుతుంది. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్టు మాదిరిగానే రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఫలితాలు గోల్డ్-స్టాండర్డ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షల వలె ఖచ్చితమైనవి అని పరిశోధకులు స్పష్టం చేశారు.
