వార్షిక ఉన్నత విద్య ర్యాంకింగ్ 2021లో బీటెక్ డాటా సైన్స్ ప్రోగ్రామ్ టాప్10లో ఒకటిగా నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు)
అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణ మరియు విజ్ఞాన సమాజం కోసం స్థిరత్వం అందించడం ద్వారా ఓ రోల్ మోడల్‌గా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన లాభాపేక్ష లేని నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) ఇప్పుడు తమ డాటా సైన్స్ ప్రోగ్రామ్‌లో బీటెక్‌కు గానూ టాప్ 10 యూనివర్శిటీలలో ఒకటిగా నిలిచింది. గత సంవత్సరం 10వ వార్షిక ఇండియన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్, అవార్డుల వేడుకలో యూనివర్శిటీ ఆఫ్ ద ఇయర్‌గా కూడా ఎన్‌యు గుర్తింపు పొందింది.
ఈ వార్షిక ఉన్నత విద్య ర్యాంకింగ్‌ను ఎడ్యుకేషన్ వరల్డ్ , సెంటర్ ఫర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సీ–ఫోర్) సహకారంతో నిర్వహించింది. ఈ జాతీయ ర్యాంకింగ్స్‌ను ఫ్యాకల్టీ యొక్క సామర్ధ్యం, పరిశోధన మరియు అభివృద్ధి, కరిక్యులమ్ మరియు బోధన, ప్లేస్‌మెంట్స్ మరియు అందించే విస్తృత శ్రేణి కార్యక్రమాలు వంటి వాటి ఆధారంగా ఇస్తారు. ఎన్‌యు ఇప్పుడు భారతదేశంలో టాప్ 25 ప్రైవేట్ యూనివర్శిటీలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. ఎన్‌యు యొక్క బీటెక్ డాటా సైన్స్ ప్రోగ్రామ్‌ను శక్తివంతమైన పరిశోధన అనుసంధానత మరియు పరిశోధనాధారిత విధానంతో గుర్తించారు.
నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీటెక్‌లో డాటా సైన్స్ డిగ్రీ. ప్రపంచవ్యాప్తంగా డాటా సైన్స్ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని తీర్చిదిద్దారు. నిట్ యూనివర్శిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ పరిమల్ మండ్కే మాట్లాడుతూ కోవిడ్ కారు మబ్బుల నడుమ ఈ అవార్డు ఓ వెండి వెలుగు. ఈ ర్యాంకింగ్స్, పరిశ్రమ అనుసంధానిత, సాంకేతికాధారిత, పరిశోధన చేత నడుపబడుతున్న మరియు సౌకర్యవంతమైన అనే నాలుగు మూల సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించిన అసాధారణ విద్యాంశాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఎన్‌యు వద్ద మేము విద్యార్థులకు విజయవంతమైన కెరీర్‌లను ఈ కష్టకాలంలో నిర్మించేందుకు సహాయపడేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.