1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Arjun Tendulkar enjoys lunch at Nando s with Danielle Wyatt in England

ఇంగ్లీష్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డేటింగా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. ఈ బుడతడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. క్రికెట్‌లో అమితంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అండర్-19 భారత జట్టులో సభ్యుడైన అర్జున్ టెండూ

Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. ఈ బుడతడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. క్రికెట్‌లో అమితంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అండర్-19 భారత జట్టులో సభ్యుడైన అర్జున్ టెండూల్కర్... శ్రీలంకతో జరిగిన అండ్ - 19 టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి రాలేదు.
 
లంక నుంచే ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అక్కడ ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌తో కలసి అర్జున్‌ లంచ్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో పలువురు పలువిధాలుగా మాట్లాడుతున్నారు. డేనియల్‌తో అర్జున్ డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
 
నిజానికి గతంలో 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ట్వీట్‌ చేసిన క్రికెటరే ఈ వ్యాట్ కావడం గమనార్హం. అలా బహిరంగంగా తనను పెళ్లి చేసుకోమని కోరిన డేనియల్.. 19 యేళ్ల అర్జున్ టెండూల్కర్‌తో లంచ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ముంబై ఆఫ్‌ సీజన్‌ క్యాంప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో అర్జున్‌ టెండూల్కర్‌ పేరు లేకపోవడం గమనార్హం. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌.. నో బాల్ వేసిన బౌలర్‌పై విమర్శలే విమర్శలు