సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (14:26 IST)

నాకు పాకిస్థాన్‌ వెళ్లాలని వుంది.. సర్కారు సలహా తీసుకుంటున్నా: సునీల్ గవాస్కర్

పాకిస్థాన్‌కు వెళ్లే విషయంలో భారత సర్కారు సలహా తీసుకుంటానని.. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరయ్యే విషయంల

పాకిస్థాన్‌కు వెళ్లే విషయంలో భారత సర్కారు సలహా తీసుకుంటానని.. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరయ్యే విషయంలో కేంద్ర ప్రభుత్వ సలహా తీసుకుంటానని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని, తనకూ వెళ్లాలనే ఉందని సునీల్ గవాస్కర్ చెప్పారు. 
 
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలుత 11వ తేదీన నిర్ణయించారు. ఆపై 14వ తేదీకి దాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, మరేవైనా కారణాల వల్ల ఆయన ప్రమాణ స్వీకారం ఆగస్టు 15కు వాయిదా పడితే మాత్రం తాను హాజరు కాలేనని గవాస్కర్ తెలిపారు. 15న తన తల్లి 93వ పుట్టిన రోజుతో పాటు భారత స్వాతంత్ర్య దినోత్సవం ఉందని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. తాను టెస్టు మ్యాచ్‌లలో కామెంట్రీ చేసేందుకు లండన్ వెళ్లాల్సి వుందని కూడా గవాస్కర్ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించారు. తన ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజునే వారిని ఇండియాకు అప్పగించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇమ్రాన్ ఆదేశించారు. ఈ విషయమై భారత అధికారులకు సమాచారం కూడా అందింది. వీరంతా గుజరాత్‌కు చెందిన మత్స్యకారులుగా తెలుస్తోంది.