మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (15:52 IST)

మోడీనే కాదు ఎవర్నీ పిలవొద్దు.. సాదాసీదాగానే ఇమ్రాన్ ప్రమాణం

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులను ఆహ్వానించాలని ఆయన తొలుత భావించారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకున్నా

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులను ఆహ్వానించాలని ఆయన తొలుత భావించారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం సాదాసీదాగానే ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ఇతర దేశాల ప్రతినిధులను కూడా  ఆహ్వానించాలని నిర్ణయించినా తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నారు.
 
ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ప్రసాదాసీదాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) నిర్ణయించుకుంది. దీంతో మోడీ సహా ఏ ఇతర విదేశీ ప్రతినిధులు కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం లేదు. కార్యక్రమం భారీగా నిర్వహిస్తే ఖజానా మీద భారం పడుతుందని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ పేర్కొంది. 
 
కేవలం ఇమ్రాన్ స్నేహితులు, కొందరు క్రీడాకారులను మాత్రమే ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తున్నట్టు పీటీఐ ప్రకటించింది. ఐవాన్-ఎ-సదర్ (అధ్యక్ష భవనం)లో అత్యంత సాదాసీదాగా ఇమ్రాన్ నూతన ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకొని మోడీని, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల పటిష్టత దృష్ట్యా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్‌ను, క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సిద్దూలను కూడా ఆహ్వానించినట్లు వార్తలొచ్చిన విషయం తెల్సిందే.