శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : శనివారం, 5 మే 2018 (11:11 IST)

మాస్ మహారాజ ''నేల టిక్కెట్టు''కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ''నేల టిక్కెట్టు'' ఆడియో లాంచ్‌కు వస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా నిజం కాదనీ, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ఆ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ''నేల టిక్కెట్టు'' ఆడియో లాంచ్‌కు వస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా నిజం కాదనీ, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ ఇప్పుడు అదే రూమర్ నిజమైంది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా 'నేల టిక్కెట్టు' ఆడియో లాంచ్ కార్యక్రమం జరుగుతుందని సినిమా డైరక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు.
 
ఇప్పటికే రిలీజ్ చేసిన టిజర్ మాస్ మహారాజ రవితేజ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మే 10 వ తేది నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. రవితేజ హీరోగా, మాళవికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న 'నేల టికెట్టు' సినిమా విడుదల కానుంది.