సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:58 IST)

ఈ ధోనీ వున్నాడు చూశారు గురూ... రెప్పపాటులో ఏం చేసాడో చూడండి...(Video)

ఫోటో కర్టెసీ- ట్విట్టర్
ధోనీ అంటే మామూలోడు కాదని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా మరోసారి మెరుపుతీగలా షాకిచ్చాడు న్యూజీలాండ్ బ్యాట్సమన్ నీషమ్‌కి. బ్యాట్సమన్ నీషమ్ బంతిని కొట్టడంతో రన్నర్ ప్లేసులో వున్న మరో బ్యాట్సమన్ రా.. రా అంటూ అరిచాడు. అంతే... నీషమ్ బంతి ఎటు వెళ్లిందో చూసుకోకుండా మొద్దుబారిన మెదడుతో పరుగు కోసం యత్నించాడు. 
 
ధోనీ చూసేది ఇలాంటి అవకాశాల కోసమే. ఇంకేముందు మెరుపువేగంతో వికెట్లకు గిరాటేసాడు. ఇది 37వ ఓవర్లో జరిగింది. ధోనీ అంత వేగంగా వికెట్లపై బంతిని గిరాటేస్తాడని ఊహించలేని నీషమ్ ఔటయి పెవిలియన్ దారి పట్టాడు. అందుకే దటీజ్ ధోనీ అంటూ ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారంతా... చూడండి ఈ వీడియోను..