1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India vs Sri Lanka Live Score, Asia Cup 2022

ఆసియా కప్ : కోహ్లీ డకౌట్... నిరాశపరిచిన మిడిల్ ఆర్డర్... భారత్ 173/8

team india
ఆసియా కప్ సూపర్ -4 మ్యాచ్‌లలో భాగంగా, మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా శ్రీలంక, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిరాశపరిచారు. ఒక దశలో కష్టాల్లో ఉన్నట్టు కనిపించిన జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు ఆదుకున్నారు. దీంతో ఆ మాత్రం పరుగులనైనా చేయగలిగింది. 
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (6), ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (0) ఇద్దరూ విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో బ్యాటింగ్‌ కుప్పకూలకుండా జాగ్రత్త పడిన రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) రాణించారు. 
 
ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేక పోయారు. పాండ్యా 17, పంత్ 17, హుడా 13 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. మ్యాచ్ ఆఖరులో అశ్విన్ 7 బంతుల్లో 15 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. భువి డకౌట్ కాగా, అర్షదీప్ సింగ్ (1) నాటౌట్‌గా నిలిచాడు. 
 
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లతో చెలరేగగా.. చమిక కరుణరత్నే, శనక చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆసియా కప్ : డూ ఆర్ డై మ్యాచ్‌లో ఓడిన భారత్.. ఇక ఇంటికేనా?