సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (14:03 IST)

ఫ్లిప్‌కార్ట్‌లో "బిగ్ బిలియన్ డేస్ సేల్" - 90 శాతం మేరకు డిస్కౌంట్

Flipkart
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల పండుగ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏకంగా 90 శాతం మేరకు డిస్కౌంట్‌ను కల్పించనుంది. "ది బిగ్ బిలియన్ డేస్ సేల్" పేరుతో ఈ ఆఫర్లను ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ఈ సేల్‌లో రియల్మీ, పోకో, వివో, శాంసంగ్ వంటి కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ధరకు విక్రయినున్నాయి. అయితే, ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఇస్తారన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. 
 
అదేసమయంలో ఎలక్ట్రానిక్ వస్తుపులపై 80 శాతం మేరకు డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రిమ్మర్లపై 75 సాతం, రూ.99కే స్క్రీన్ కార్డులు, గేమింగ్ ల్యాప్ ట్యాప్‌లపై 40 శాతం రాయితీ, ప్రింటర్లు, మానిటర్లపై 80 శాతం వరకు రాయితీని ఇవ్వనుంది. 
 
ఇకపోతే స్మార్ట్ టీవీలు, వాటి విడి భాగాలపై 80 శాతం తగ్గింపులు ప్రకటించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీల ధర రూ.8999 నుంచి ప్రారంభంకానుంది. ఐరన్ బాక్సులు మాత్రం రూ.299 నుంచే ప్రారంభంకానుంది. ఏసీలపై 55 శాతం మేరకు తగ్గింపు ఇవ్వనుంది. 
 
ఫ్యాషన్ వస్తువులపై ఏకంగా 60 నుంచి 90 శాతం మేరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నైక్, అడిటాస్, పుమా షూలపై 50 నుంచి 80 సాతం తగ్గింపుల ఉండనున్నాయి. మహిళల దుస్తులు, జీన్స్ ప్యాంట్లపై 90 మేరకు, పురుషుల టీ షర్టులు, జీన్స్‌లపై 80 శాతం మేరకు తగ్గింపులు లభించనున్నాయి.