సంబంధిత వార్తలు
- పవన్ కల్యాణ్ - రాహుల్ గాంధీల్లా రెండేసి చోట్ల పోటీ చేసినవారెవరు?
- రాహుల్ డబ్బులిస్తే భార్యకు భరణం చెల్లిస్తా : కోర్టులో భర్త కౌంటర్
- సౌతిండియాపై కన్నేసిన రాహుల్.. వాయినాడ్ నుంచి పోటీ
- అసలు మనం దాడి చేసామా..? 300 మందిని చంపామా..? పుల్వామా ప్రితోడా
- మిస్టర్ కోహ్లీ.. వరల్డ్ కప్‌ను గెలవడం అంత ఈజీ కాదు : ద్రవిడ్ హెచ్చరిక (video)
హార్దిక్ పాండ్యా, రాహుల్‌కి నోటీసులు.. ఎందుకంటే.?
భారత క్రికెటర్‌లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఓ ప్రైవేట్ టెలివిజన్ టాక్‌షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్ వారికి నోటీసులు జారీ చేసారు.
వారిద్దరు వ్యక్తిగతంగా తన ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిబంధనల ప్రకారం రాహుల్, హార్దిక్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. వారిద్దరి అభిప్రాయాలు వినడం న్యాయం. ఎప్పుడు వస్తారన్నది వాళ్ల ఇష్టం అని అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ అన్నారు.
ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న వీరిద్దరు ముంబై, పంజాబ్ మధ్య జరిగే సమయంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ జైన్‌కు హార్దిక్, రాహుల్ వ్యవహారంతో పాటు గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కూడా ముందు ఉన్నటు తెలుస్తున్నది.
తర్వాతి కథనం
