1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Saud Shakeel becomes first Pakistan player to get 'timed out' after oversleeping

పాకిస్థాన్ క్రికెటర్ పేరిట చెత్త రికార్డు.. దేశవాళీ టోర్నీలో ఘటన!

Saud Shakeel
దేశవాళీ క్రికెట్‍‌లో ఓ పాకిస్థాన్ క్రికెటర్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పేరు సౌద్ షకీల్. ప్రెసిడెంట్ కప్ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఫైనల్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్‌కు దిగాల్సిన వేళ డ్రెస్సింగ్ రూములో నిద్రపోయి ఆలస్యంగా క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో అంపైర్ అతడిని టైమ్‌డ్ ఔట్‌గా ప్రకటించారు. 
 
మంగళవారం పీటీవీతో జరిగిన మ్యాచ్‌లో షకీల్ స్టేట్ బ్యాంకు తరపున బరిలోకి దిగారు. రంజాన్ మాసం కావడంతో రాత్రి 7.30 గంటలకు నుంచి తెల్లవారుజామునన 2.30 గంటల వరకు మ్యాచ్ నిర్వహించారు. పేసర్ మహ్మద్ షాజాద్ రెండు వరుస బంతుల్లో ఉమర్ అమీన్, ఫవాద్ అలంను పెవిలియన్ పంపాడు. 
 
ఈ క్రమంలో మూడు నిమిషాల్లోపు మరో బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉండగా షకీల్ ఆ వ్యవధి దాటిన తర్వాత క్రీజులోకి వచ్చి గార్డు తీసుకున్నాడు. అయితే, పీటీవీ కెప్టెన్ అహ్మద్ బట్ అప్పీల్ చేయడంతో షకీల్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా టైమ్‌డ్‌ ఔట్ అయిన ఏడో బ్యాటర్‌గా, పాక్ చరిత్రలో ఇలా ఔటైన తొలి ఆటగాడిగా షకీల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. 
తర్వాతి కథనం
Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ అదరగొట్టినా కంగారూల చేతిలో ఇండియా మాస్టర్స్ ఓటమి (video)