గురువారం, 6 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మార్చి 2025 (08:25 IST)

Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ అదరగొట్టినా కంగారూల చేతిలో ఇండియా మాస్టర్స్ ఓటమి (video)

Sachin
Sachin
ఇంటర్నేషనల్ మాస్టర్‌ లీగ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మెరిశాడు. బుధవారం బీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియా మాస్టర్స్ ద్వయం షేన్ వాట్సన్, బెన్ డంక్ రాణించారు. దీంతో ఆస్ట్రేలియా గెలిచింది. ఇండియా మాస్టర్స్ కోసం సచిన్ టెండూల్కర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకపోయింది. 
 
ఈ మ్యాచ్‌లో టెండూల్కర్ 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేసినా.. నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లు బాది ఇండియా మాస్టర్స్ ఇన్నింగ్స్‌ను సచిన్ చక్కదిద్దాడు. మిగిలిన బ్యాటర్లు ప్రతిభను కనబరచకపోవడంతో చివరికి ఇండియా మాస్టర్స్ 95 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్‌లో తొలి ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ సాధించలేకపోయింది.
 
మొదట బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 269 పరుగులు చేసి ఇండియా మాస్టర్స్ కు 270 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ తరపున సచిన్ కాకుండా యూసుఫ్ పఠాన్ 25 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఓడినా ఇండియా మాస్టర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.