Jemimah Rodrigues: మహిళల వన్డే ప్రపంచకప్ 2025.. జెర్మియా, హర్మన్‌ప్రీత్ అదుర్స్.. జీసస్ వల్లే? (video)
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. సెమీ-ఫైనల్‌లో భారత మహిళా జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించి అద్భుత విజయాన్ని సాధించింది.
ఈ స్కోర్ ఛేజింగ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రన్ ఛేజ్ రికార్డును సృష్టించింది. ఈ విజయంలో జెమిమా రోడ్రిగ్స్ రికార్డు సెంచరీ (127 పరుగులు) జట్టుకు వెన్నెముకగా నిలిచింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు హాఫ్ సెంచరీతో అండగా నిలవడంతో ఈ చారిత్రక విజయం సాధ్యమైంది.
ఈ సందర్భంగా జీసస్ వల్లే విజయం సాధ్యమైందని, ఆయనే తనను నడిపించాడని చెబుతూ టీమిండియా మహిళా బ్యాటర్, మ్యాచ్ విన్నర్ జెమీమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టైటిల్ పోరు నవంబర్ 2, 2025, ఆదివారం నాడు జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు వేదిక సెమీ-ఫైనల్ జరిగిన డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై కావడం భారత జట్టుకు ఒక అదనపు బలంగా నిలిచింది.