సంబంధిత వార్తలు
- విశాఖ విద్యార్థినికి అరుదైన గౌరవం.. ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం
- దివ్వెల మాధురి కారు బోల్తా, ఆత్మహత్య చేసుకుందామనుకునే ఇలా చేసా
- భోగాపురం ఎయిర్‌పోర్టును ముందుగానే పూర్తిచేస్తాం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- సామాజికమాద్యం ద్వారా చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన సామాజిక కార్యకర్త... స్పందించిన సీఎం
- పవన్ కల్యాణ్‌కి 3 పెళ్లిళ్లు ఎందుకయ్యాయో ఇప్పుడర్థమైందంటున్న దువ్వాడ
మోసం చేసిన ప్రియుడిపై కత్తి - యాసిడ్‌తో యువతిదాడి!
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిపై కత్తి, యాసిడ్‌తో దాడిచేసింది. కళ్యాణమండపానికి నేరుగా వచ్చిన ఆ యువతి ఈ దాడికి తెగబడింది. మరికొన్ని క్షణాల్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు తనను మోసం చేశాడని చెబుతూ ఓ యువతి అక్కడకు వచ్చి కత్తి, యాసిడ్‌తో వీరంగం చేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారంతా హతాశులయ్యారు.
అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్ బాషా, తిరుపతికి చెందిన జయ అనే మహిళ పదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. కొంత కాలం కిందట స్వగ్రామానికి వచ్చేసి ఓ యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఆదివారం వారి వివాహం జరుగుతోందని తెలుసుకున్న జయ.. కార్యక్రమానికి వచ్చి ప్రియుణ్ని నిలదీసింది.
ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోతూ తనతో తెచ్చుకున్న కత్తి, యాసిడ్‌తో అతనిపై దాడి చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో కరీష్మా అనే మహిళపై యాసిడ్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన బాషా.. కత్తితో జయపై దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. వధువు తరపు బంధువులు పెళ్లిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు.
