ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 11 ఆగస్టు 2024 (21:40 IST)

దివ్వెల మాధురి కారు బోల్తా, ఆత్మహత్య చేసుకుందామనుకునే ఇలా చేసా

divvela madhuri car accident
divvela madhuri car accident కి గురైంది. వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావు- దివ్వెల మాధురి వ్యవహారం గత కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తనకు మాధురికి మధ్య వున్న సంబంధం అడల్ట్రీ రిలేషన్ అంటూ దువ్వాడ చెప్పుకొస్తున్నారు. ఐతే దీనిపై దువ్వాడ భార్య వాణి తన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాధురి తన భర్తను వలలో వేసుకున్నదనీ, ఆమె గురించి పలాసలో అందరికి తెలుసునని అన్నారు.
 
ఈ దుమారం ఇలా జరుగుతుండగానే ఆదివారం మధ్యాహ్నం పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో ఆగి వున్న కారును దివ్వెల మాధురి కారు ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
 
కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి విలేకరులతో మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస రావు భార్య వాణి తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోందనీ, తన పిల్లలపై దారుణమైన వ్యాఖ్యలు చేసిందనీ, ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. తన పిల్లలపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఆమెను తక్షణమే అదుపులోకి తీసుకోవాలనీ, లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం తను డిప్రెషన్లో వున్నాననీ, ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని కారుతో ఢీకొట్టినట్లు వెల్లడించారు.