1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Telangana : Model School Teacher Suicide attempt in Warangal

తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్యయత్నం! Telangana : Model School Teacher Suicide attempt in Warangal Telangana, Model School Teacher, Suicide Attempt, Warangal, తెలంగాణ, మోడల్ స్కూల్ టీచర్, ఆత్మహత్యాయత్నం వరంగల్ తెలంగాణ రాష్ట

harassment
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో ఓ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మోడల్ స్కూల్‌లో పని చేసే టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సహచర ఉపాధ్యాయుల వేధింపులను భరించలేని ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం జరిగింది. పాఠాల మాజీ ప్రిన్సిపాల్, టీజీటీ సివిక్స్ ఉపాధ్యాడు రాజేందర్, తోటి ఉపాధ్యాయులు డి.రాజు, మౌలాలి, సోషల్ ఉపాధ్యాయురాలు ఓ బృందంగా ఏర్పడి బాధిత ఉపాధ్యాయురాలు హారికను వేధింపులకు గురిచేశారు. తనను అసభ్యకరంగా ఫోటోలు తేసిన రాజేందర్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారని హారిక మీడియాకు తెలిపారు. పైగా, రాజేందర్‌పై గతంలోనూ పలువురు మహిళా సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని హారిక ఆరోపించింది. 
 
ఈ క్రమంలో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బుధవారం దోమల నివారణ మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడా వుంది. బాధిత ఉపాధ్యాయురాలి ఆరోపణల నేపథ్యంలో మండల విద్యాశాఖ నోడల్ అధికారి స్కూల్‌ను సందర్శించి వివరాలను సేకరించారు. రాజేందర్ మాత్రం తనపై హారిక చేసిన ఆరోపణలను కొట్టిపడేశారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
నేను పోతిన మహేష్‌లా చేయి నరుక్కుంటా అనలేను: కిరణ్ రాయల్ - video