మంగళవారం, 4 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:37 IST)

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు బైబై.. నాలుగు రోజుల పాటు వర్షాలు

Rains
భానుడి భగభగలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. వేడి సెగలకు తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో రెండు తెలుగు రాష్రాలకు ఆయా వాతావరణ శాఖలు చల్లని కబురు అందించాయి. మరో నాలుగు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని, అలానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలుగు ప్రజలు వర్షాలు రాబోతున్నాయా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పగా…తాజాగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం, అలానే 10,11వ తేదీల్లో వాతావరణం చల్లబడుతుందని ఐఎండీఏ చెప్పింది.
 
ఏపీలో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.