శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (16:22 IST)

నిన్న వేయించిన చేప తిన్నారు.. ఈరోజు ఆరెంజ్ పండు తిన్నారు?

Tejashwi Yadav
Tejashwi Yadav
ఎన్నికల సందర్భంగా బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తీవ్ర ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రచారం కోసం హెలికాప్టర్‌కు వెళ్లినప్పుడు వేయించిన చేప తిన్నారు తేజస్వి యాదవ్. ఆ వీడియో తన సామాజిక వెబ్‌సైట్‌లో షేర్ చేశారు. 
 
తేజస్వి యాదవ్ చేప తినే వీడియో వైరల్ అయ్యింది. శ్రీ రామ నవమిని పురస్కరించుకుని ప్రారంభమైన నవరాత్రి రోజుల్లో చేపలు తిన్న ఫోటోలు షేర్ చేయడంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తేజస్వి యాదవ్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు బిజెపి విమర్శలు చేసింది.  
 
ఈ నేపథ్యంలో ఒక వీడియోను విడుదల చేసి భాజపాకు చెక్ పెట్టారు తేజస్వి యాదవ్. అంటే లాలు యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, వికాశీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహానితో హెలికాప్టర్ చేరుకున్నారు. ఆ తర్వాత బత్తాయి పండ్లను కడుపునిండా తిన్నారు. 
Tejashwi Yadav
Tejashwi Yadav
 
ఆ వీడియోను తన సామాజిక వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసిన తేజస్వి యాదవ్, "హలో ఫ్రెండ్స్, ఇన్నాళ్లకు హెలికాప్టర్‌లో ఆరెంజ్ పార్టీ ఉంది. ఆరెంజ్ పండ్లు తింటే ఆరెంజ్ పార్టీ నేతలకు కోపం రాదు కదా? అంటూ సెటైర్లు విసిరారు.