గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (23:09 IST)

తెలంగాణలో నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ల శ్రేణిని విడుదల చేసిన బజాజ్ ఆటో

Bajaj Auto
ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన, మూడు చక్రాల వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో, ప్యాసింజర్ విద్యుత్ ఆటో  శ్రేణిని ఈరోజు హైదరాబాద్‌లో విడుదల చేసింది. ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను బజాజ్ RE E-Tec 9.0గా విడుదల చేసింది. బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ శ్రేణిని బజాజ్ ఆర్&డి సెంటర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. వీటిని వాలూజ్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారుచేస్తున్నారు. ఈ కొత్త వాహనాలు విస్తృత పరిధి, అత్యధిక లోడ్ మోసే సామర్థ్యం, దీర్ఘకాలిక మన్నిక కోసం రూపొందించారు. 
 
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లలో IP67 రేటెడ్ అధునాతన Li-ion బ్యాటరీ, టూ-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటరు వున్నాయి. బ్యాటరీని 16-amp, 220 V ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనాలు 5 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిమీల వారంటీతో పాటు, కస్టమర్‌లకు భరోసా ఇవ్వడానికి, 24/7 రోడ్‌సైడ్ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది.
 
బాబ్జి నెల్లి, డివిజనల్ మేనేజర్ సేల్స్, కుబేర్. కె వి, డివిజనల్ మేనేజర్ సర్వీస్, బజాజ్ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ, “కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్యాసింజర్, కార్గో ఫార్మాట్‌లలో అందించడం సంతోషంగా వుంది. ఈ సురక్షితమైన, విశ్వసనీయమైన, అధిక-పనితీరు గల వాహనాలను అభివృద్ధి చేయడానికి వినియోగదారుల పట్ల మా లోతైన అవగాహనను ఉపయోగించాము. వినియోగదారులకు మా సేవలను విస్తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా మా డిస్ట్రిబ్యూషన్ సేవలను విస్తరించనున్నాము" అని అన్నారు.