శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (19:25 IST)

త్వరలో సీఎన్‌జీ సపోర్ట్‌ చేసే బైక్‌లు.. ఎలా సాధ్యం..?

CNG Bike
CNG Bike
పెట్రోల్‌ సమస్యకు సీఎన్‌జీ చెక్‌ పెట్టిందని చెప్పాలి. పెట్రోల్‌తో పోల్చితే సీఎన్‌జీ ధర తక్కువగా ఉండడంతో వాహనదారులకు ఊరట లభించింది. సీఎన్‌జీ సదుపాయం కేవలం కార్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ సీన్ మారనుంది. 
 
త్వరలో సీఎన్‌జీ సపోర్ట్‌ చేసే బైక్‌లు కూడా రానున్నాయి. వచ్చే త్రైమాసికంలో సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని బజాజ్‌ తెలిపింది. 
 
సీఎన్‌జీ బైక్‌లు అందుబాటులోకి వస్తే.. ఇంధన ధర, నిర్వహణ ఖర్చు 50-65 శాతం మేర తగ్గుతుందని కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. 
 
రానున్న రోజుల్లో దాదాపు ప్రతి 15 రోజులకు ఒక కొత్త బైకును విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 
 
ఇక సీఎన్‌జీ బైక్‌ను కేవలం ఒక్క వేరియంట్‌లోనే కాకుండా.. 100సీసీ నుంచి 160సీసీ వరకు అన్ని వేరియంట్లలో సీఎన్‌జీ బైకులను విడుదల చేస్తామని రాజీవ్ బజాజ్ వివరించారు.