చాక్లెట్లు, వడా పావ్ కొనిస్తానని చెప్పి ఇద్దరు కుమారుల్ని కాలువలో విసిరేశాడు..
Maharashtra
చాక్లెట్లు, వడా పావ్ కొనిస్తానని చెప్పి రోడ్జ్ తన స్కూటర్‌పై పిల్లలను బయటకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా తినే ప్రదేశానికి తీసుకెళ్లే బదులు, అతను కాలువ పక్కన ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి స్కూటర్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. తాము చనిపోతామని ఏడుస్తూ, ఆపమని ఆ సోదరులు వేడుకున్నా, అతను వారిని కాలువలోకి విసిరేశాడని పోలీసులు తెలిపారు.
కాలువ దగ్గర ఎలక్ట్రిక్ వాటర్ పంప్ ఆపరేట్ చేయడానికి వచ్చిన రైతులు అతనిని అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. రైతులు పిల్లలను కాపాడలేకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పచోడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్జ్ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, తన కుమారులను కాలువలోకి విసిరినట్లు అతను ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి నుండి ఆర్యన్, శ్యామ్ల కోసం గాలింపు బృందాలు వెతుకుతున్నా, వారు దొరకలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

