1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Chittoor Constables attack on Mother dies after being attacked while drunk

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కన్నతల్లిని కర్కశంగా కొట్టి చంపేశాడు. కుటుంబ తగాదాలను మనసులో పెట్టుకుని ఆ కిరాతక కానిస్టేబుల్.. కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ రోసీ నగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన శంకర్... బుధవారం రాత్రి తన తల్లి వసంతము (63)ను మద్యానికి డబ్బులు అడగగా, ఆమె లేదు అనడంతో ఆమెను శంకర్ కాలితో బలంగా తన్నాడు. ఆపై ఆమెను విచక్షణారహితంగా పిడుగుద్దులతో చితకబాదాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసంతమ్మ అస్వస్థతకు గురికావడంతో బంధువులు చికిత్స నిమిత్తం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో తన స్వగృహానికి తీసుకురాగా మృతి చెందింది. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నెట్టి కంటయ్య వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?